Header Banner

శ్రీశైలం డ్యాం భద్రతపై తక్షణ చర్యలు! తెలుగు రాష్ట్రాల ఆందోళనలపై స్పందించిన కేంద్ర!

  Tue Apr 29, 2025 13:16        Politics

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్‌ అనిల్‌ జైన్‌ సూచించారు. అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం విజయవాడలో శ్రీశైలం సహా వివిధ ప్రాజెక్టులపై అనిల్‌ జైన్‌ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి ప్రాజెక్టుకు తీసుకోవాల్సిన భద్రత చర్యలు వివిధ ప్రతిపాదనలపై ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌కు వివరించారు. అదే క్రమంలో డ్యాం తక్షణ మరమ్మతులకు రూ.30-35 కోట్లు అవసరం ఉందని శ్రీరామచంద్రమూర్తి వివరించారు. తక్షణమే అసరమైన నిధులు ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు అనిల్‌ జైన్‌ సూచించినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టు 2009 వరదలకు భారీగా దెబ్బతిందని, భద్రత ప్రశ్నార్థకంగా ఉందంటూ ఇప్పటికే పలు నిపుణుల కమిటీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: వర్షం పడడంతో ఉగ్రవాదుల ప్లాన్ ఛేంజ్.. ఏప్రిల్ 22న ఫుడ్ స్టాల్ వద్ద వేచి చూసి..

 

డ్యాం స్పిల్‌వేలో 490 అడుగుల్లో ఉన్న గ్యాలరీలు కనిష్ఠ నీటి మట్టంలో 220 గ్యాలరీలలో లీకేజీ ఏర్పడుతుందని, పలు మరమ్మతులు చేపట్టాలని వీటిని మే 31లోగా పూర్తి చేయాలని గతంలోనే ఆదేశించినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నేషనల్‌ డ్యాం సేఫ్టీ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ మంగళవారం (నేడు) శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. విజయవాడలో జరిగిన ప్రాజెక్టుల సమీక్ష అనంతరం ఆయన శ్రీశైలానికి బయలుదేరినట్లు తెలిసింది. ఆయనతో పాటు సీడబ్లూసీ, సెంట్రల్‌ సాయిల్డ్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం కూడా శ్రీశైలం డ్యాం పరిశీలించే అవకాశం ఉందని ఇంజనీర్లు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations